EPFO Users Withdraw Money Via UPI Apps (Credits: X)

Newdelhi, Feb 22: గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe), పేటీఎం వంటి యూపీఐ ద్వారా పీఎఫ్‌ సొమ్మును విత్‌ డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) (EPFO) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందుకోసం నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ పీసీఐ)తో ఈపీఎఫ్‌ఓ చర్చలు జరుపుతున్నది. వచ్చే 2-3 నెలల్లో ఈ సదుపాయాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్‌ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టినట్టు ఈపీఎఫ్‌ఓ అధికారిక వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

తీరనున్న చిక్కులు

ఇప్పటివరకు ఈపీఎఫ్‌ఓ ఖాతాదారుల క్లెయిమ్‌ సెటిల్‌ అయిన తర్వాత బ్యాంకు ఖాతాల్లోకి  డబ్బులు జమ అయ్యేవి. అయితే, దీనికి రెండు మూడు రోజులు పట్టేది. మధ్యలో బ్యాంకు సెలవులు వస్తే, ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేది. అయితే, కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఫోన్‌ పే, జీపే, పేటీఎం వంటి యూపీఐ ప్లాట్‌ ఫామ్‌ ల ఐడీకే పీఎఫ్‌ సొమ్ము వస్తుంది. దీంతో క్లెయిమ్‌ సెటిల్‌ అయిన క్షణాల్లోనే ఖాతాదారులకు డబ్బులు జమ అవుతాయి.

ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం