News

Viral Video: వీడియో ఇదిగో, డ్యాం నుంచి విడుదల చేసిన నీటి నుంచి భారీ స్థాయిలో నురుగు, హైవే ఎలా పేరుకుపోయిందో చూడండి

Hazarath Reddy

హోసూరు కెలవరపల్లి డ్యాం నుంచి నీటినీ విడుదల చేసిన అధికారులు...భారీ స్థాయిలో రసాయన వ్యర్థాలు కలవడంతో రోడ్డుపై భారీ స్దాయిలో మంచు కొండలు తరహాలో హైవే పై పేరుకుపోయిన నురుగు. రోడ్డు మొత్తం నూరుగుతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Israeli Missile Attack: ఇజ్రాయెల్ దాడిలో క్షణాల్లో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

హెజ్‌బొల్లా (Hezbollah) ఇజ్రాయెల్‌ మధ్య క్షిపణులు, డ్రోన్‌ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడిలో లెబనాన్‌ రాజధాని బీరుట్‌ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ కుప్పకూలింది. క్షణాల్లో ధూళిగా మారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

YS Jagan Slams AP Govt: డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన జగన్, అక్రమాలు బయటపెడుతున్నందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

చంద్రబాబు కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మండిపడ్డారు వైఎస్‌ జగన్‌. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: కనీసం చెల్లెలుగా కూడా చూడటం లేదు, నాపై ట్రోలింగ్ వెనుక జగనన్న, వదిన ఉన్నారన్న షర్మిల, రాక్షస ముఠాతో ట్రోల్స్ చేస్తున్నారని మండిపాటు

Arun Charagonda

నాపై ట్రోలింగ్ వెనుక మా అన్నయ్య, వదిన , సజ్జల ఉన్నారు అన్నారు వైఎస్ షర్మిల. వీళ్లంతా ఓ రాక్షస ముఠాను తయారు చేసి సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ చేపిస్తున్నారు అన్నారు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి భార్యను కూడా అవమానించే స్థాయికి దిగజారారు అన్నారు. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు తోడుగా ఉన్నాను.. కానీ ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని పక్కన పెట్టారు అని మండిపడ్డారు.

Advertisement

Lorry Accident Video: ఆగి ఉన్న మద్యం లారీని ఢీకొట్టిన మరో లారీ, ఒకదాని వెంట ఒకటి ఢీకొట్టుకున్న మరో నాలుగు లారీలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం జాతీయ రహదారిపై లిక్కర్ లోడుతో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ భోజనానికి అని రోడ్డు పక్క ఆపడంతో వెనకాల వేగంగా వస్తున్న మరో లారీ డీ కొట్టింది. దీంతో మద్యం లారరీ బోల్తా పడింది. దాదాపు నాలుగు లారీలు ఒకదాని వెంట ఒకటి డీ కొనడంతో జాతీయ రహదారి పై ఒక్కసారిగా అయో మాయ పరిస్థితి నెలకొంది.

Deepadas Munshi: బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా, ఎమ్మెల్యే టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారన్న కామెంట్లపై ఫైర్

Arun Charagonda

బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై పరువు నష్టం దావా వేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ. ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం దీపాదాస్ మున్షీ బెంజ్ కార్లు తీసుకుందని వ్యాఖ్యలు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఈ నేపథ్యంలో కేసు దాఖలు చేయగా పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాలేదు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దీంతో నవంబర్ 5న విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు.

Bail Granted to Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు, గత రెండు వారాలుగా చంచల్ గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్

Hazarath Reddy

మహిళా డ్యాన్సర్‌పై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నకొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలంగాణ హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తనపై జానీ మాస్టర్‌ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Congress MLC Jeevan Reddy: నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా?..కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహిరంగ లేఖ, పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ చెప్పిందెంటీ , జరుగుతుంది ఏంటని ప్రశ్న?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ కు సంచలన లేఖ రాశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారో చెప్పాలన్నారు. తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు జీవన్ రెడ్డి. తన రాజకీయ భవిష్యత్ ను మీరే నిర్దేశించండి అని కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగారు జీవన్ రెడ్డి.

Advertisement

Wife Calling Husband Hijra is Cruelty: భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వమే, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసే, కోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని పంజాబ్, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ‘భర్తను హిజ్రా అని పిలవడం, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసకు గురిచేయడమేనని తెలిపింది.

Cyclone Dana Update: దానా తుపాన్ తీవ్రత తెలిపే వీడియోలు ఇవిగో, అల్లకల్లోలంగా సముద్రం, వణుకుతున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు

Hazarath Reddy

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దానా’ తుఫాన్ (Cyclone Dana)‌ వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఇది నేటి అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

AI Chatbot: ఏఐ చాట్‌బాట్ తో ప్రేమలో టీనేజర్, డిప్రెషన్ తో ఆత్మహత్య, ఏఐ- గూగుల్‌పై దావా వేసిన టీనేజర్ తల్లి...వివరాలివిగో

Arun Charagonda

అమెరికాలోని ఫ్లోరిడాలో విషాదం చోటు చేసుకుంది. ఏఐ చాట్‌బాట్ కారణంగా ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ టీనేజర్ తల్లి. Character.AI చాట్‌బాట్ తన కుమారుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, Character.AI మరియు Googleకి వ్యతిరేకంగా దావా వేసింది.

Mahabubabad: తహసిల్దార్‌పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా, అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నందుకు బూతు మాటలు తిట్టిన వైనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసిల్దార్

Arun Charagonda

తహసిల్దార్ పై బూతులతో రెచ్చిపోయింది ఇసుక మాఫియా. మహబూబాబాద్ - నెల్లికుదురు మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు తహసిల్దార్ రాజు. దీంతో తహసిల్దార్ పై బూతులతో రెచ్చిపోయారు ఇసుక ట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తులు. తనను అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసిల్దార్.

Advertisement

KTR: కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన కేటీఆర్, డిచ్‌పల్లి బెటాలియన్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సమస్యను పరిష్కరించాలని వినతి

Arun Charagonda

డిచ్ పల్లి బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా వారి సమస్యను విన్నారు కేటీఆర్. అనంతరం బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు కేటీఆర్. సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు.

Andhra Pradesh: ఒంగోలు బస్టాండ్‌లో దారుణం, ఓ మహిళను కర్రతో చితకబాదిన వ్యక్తి, అందరు చూస్తుండగానే ఘటన...షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఒంగోలు లో దారుణం చోటు చేసుకుంది. ఒంగోలు బస్టాండ్‌లో మహిళను కర్రతో చావబాదాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే మహిళను చితక బాది, దుర్బాషాలాడుతు జుట్టుపట్టి లాగిపడేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Congress MLA Adluri Laxman: గంజాయి మత్తులో మర్డర్లు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో విలువ లేకుండాపోయిందన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, బూతులతో ఫైర్ అయిన ఎమ్మెల్యే..వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల కాంగ్రెస్ నేత హత్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్. గంజాయి తాగి మత్తులో మర్డర్లు చేస్తున్నారని బూతులతో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో నాకు ఏం విలువ లేదు.. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని అయినా ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ పక్కన కూడా తిరగలేదు.. సీఎం రేవంత్ రెడ్డికి, సంజయ్ గురించి ఫిర్యాదు చేశానని చెప్పారు.

Tummala Nageshwarrao: రెండోరోజు మలేషియాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన, పామాయిల్ రిఫైనరీ ప్లాంట్‌ను పరిశీలించనున్న తుమ్మల

Arun Charagonda

రెండో రోజు మలేషియాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సాగుతోంది. పహాంగ్ రాష్ట్రం జెరంటుట్ లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ .. అర్.అండ్ ఢీ సెంటర్ పరిశీలించనుంది మంత్రి తుమ్మల బృందం. కుయంటన్ పోర్ట్ లో పామాయిల్ రిఫైనరీ ప్లాంట్ పరిశీలించనున్నారు. తెలంగాణ లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ అధ్యయనం కోసం వ్యవసాయ హార్టికల్చర్ అధికారులతో కలసి మంత్రి తుమ్మల పర్యటన సాగుతోంది.

Advertisement

MAMI Film Festival 2024: ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా , ఐదు రోజుల పాటు కన్నుల పండువగా మామి ఫిల్మ్ ఫెస్టివల్

Arun Charagonda

MAMI (ముంబయి అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్) ఫిల్మ్ ఫెస్టివల్ కన్నుల పండువగా జరిగింది. ఐదు రోజుల పాటు సినీప్రియులను అలరించిన మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో 45 దేశాల చిత్రాలను ప్రదర్శించారు. ఇక మంగళవారం బాలీవుడ్ జంట అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా, ప్రముఖ నటుడు డింపుల్ కపాడియా చిత్రం గో నోని గో ప్రీమియర్‌లో స్టైలిష్‌గా కనిపించారు.

Telangana: కుక్కల దాడిలో 35 మేకల మృతి...రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఘటన, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడి ఆవేదన

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకరయ్య అనే వ్యక్తి 35 చిన్న మేక పిల్లలను 5 పెద్ద మేకలను మేకల దొడ్డిలో వదిలేసి మిగతా మేకలను మేపడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో 12 కుక్కలు మేకల దొడ్డిలో చొరబడి 30 మేక పిల్లలను 5 మేకలను కరిచి చంపేశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితుడు.

Andhra Pradesh: ట్రాన్స్‌ఫార్మర్ పక్కన పార్కింగ్...చెలరేగిన మంటలు, దగ్దమైన మూడు బస్సులు...వీడియో ఇదిగో

Arun Charagonda

విజయనగరంలో జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పక్కన పార్కింగ్ చేయగా కాలి బూడిదయ్యాయి బస్సులు. విజయనగరం రాజీవ్ స్టేడియం వద్ద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు పడటంతో మూడు బస్సులు దగ్దమయ్యాయి.

Ponnam Prabhakar: బీజేపీది అవకాశవాద రాజకీయం, నిరసనల పేరుతో ముసలి కన్నీరు కారుస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మూసి పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి

Arun Charagonda

బీజేపీ మూసి సందర్శనకు పోయింది..ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పాలన్నారు.

Advertisement
Advertisement