Bihar Gang Rape: ఢిల్లీ నిర్భయ ఘటన మళ్లీ బీహార్‌లో, కదులుతున్న బస్సులో మైనర్ బాలికపై నలుగురు సామూహిక అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: ANI)

Patna, June 9: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా బాలికలు, మహిళలపై కామాంధులు రోజురోజుకు బరితెగిస్తున్నారు.ఢిల్లీలో నిర్భయ ఘటన తరువాత కూడా అత్యాచారాలు (Bihar Gang Rape) ఆగిపోతాయనకుంటే మళ్లీ అలాంటి ఘటనే బీహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కదులుతున్న బస్‌లో కొందరు కామాంధులు 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన (Minor Girl Gang-raped In Bus) బీహార్‌లోని ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బస్‌ డ్రైవర్‌, కండక్టర్‌, హెల్పర్‌ సహా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో బాలిక వెస్ట్‌ చంపారన్‌లోని బెట్టయ్య ప్రాంతానికి వెళ్లడానికి ఎదురుచూస్తూ ఉంది. ఈ క్రమంలో బస్ రాగా.. ఆమె దానిని ఆపింది. అయితే.. వివరాలు అడగగా.. బస్ డ్రైవర్ బెట్టయ్య అదే ప్రాంతానికే వెళ్తున్నట్లు చెప్పడంతో బాధితురాలు నమ్మింది.అనంతరం బాలిక బస్‌ ఎక్కగానే ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్‌ ఇవ్వగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత బాలికపై బస్ డ్రైవర్, కండక్టర్ సహా మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారంతా అక్కడి నుంచి పారిపోయారు.

నేను బాబాను నీ కోరికలు తీరుస్తానంటూ.., రూంకి పిలిచి బాలికపై అత్యాచారం చేసిన తాంత్రికుడు, సహకరించిన బాలిక తల్లి, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన గోవా పోలీసులు

అయితే.. బాలిక స్పృహలోకి రాగానే.. బస్సు డోర్లు వేసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వారు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికను బెట్టియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటనలో బస్‌ను సీజ్‌ చేసి, నిందితులను అరెస్ట్ చేశామని బెట్టియా పోలీసు అధికారి ముకుల్ పాండే తెలిపారు. పోక్సో తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సేకరించిన సాక్ష్యాల విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నట్లు పాండే తెలిపారు.