BJP MP Nand Kumar Dies: కరోనాతో బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అంటూ ట్వీట్‌
PM Modi, Nandkumar Singh Chauhan and Shivraj Singh Chauhan (Photo Credits-ANI/PTI)

Bhopal, Mar 2: దేశంలో కరోనావైరస్ ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది. దాని భారీన పడిన వారు చాలా మంది కోలుకుంటే అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం దానికి బలైపోతున్నారు.. తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి బీజేపీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస (BJP MP Nand Kumar Singh Chauhan passes away) విడిచారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు.

దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అంటూ ట్వీట్‌ చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. అటు నందకుమార్ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ , తమనేత (BJP MP nand kumar singh chouhan) అకాలమరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2009-14మధ్య ఐదేళ్ల కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.

Here's PM Tweet

మధ్యప్రదేశ్ సీఎం నందు భయ్యా మిస్ యూ అంటూ ట్వీట్ చేశారు. ప్రజాదరణ పొందిన ప్రజా నాయకుడైన నందూ భయ్యా మా అందరినీ వదిలి వెళ్లిపోయాడు. మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆదర్శవంతమైన కార్మికుడిని, నైపుణ్యం కలిగిన నిర్వాహకుడిని, అంకితభావంతో కూడిన ప్రజాదరణ పొందిన వ్యక్తిని కోల్పోయారు. నేను బాధపడ్డాను. నందు భయ్య నిష్క్రమణ నాకు వ్యక్తిగత నష్టమే. నందూ భయ్యా రాష్ట్ర అధ్యక్షుడిగా తన ఉత్తమ సహకారాన్ని అందించారు. నందు భయ్య మృతదేహం ఈ రోజు ఆమె సొంత గ్రామానికి చేరుకోనుంది. రేపు మనమందరం వీడ్కోలు పలకాలి. ఆయన పాదాల వద్ద నా నివాళులు అర్పిస్తున్నాను. అని తెలిపారు.

Here's MP CM Tweet

నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ ఖండ్వా నుంచి బిజెపి ఎంపిగా గెలిచారు. నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ కుమారుడు హర్షవర్ధన్ చౌహాన్ తన తండ్రి మరణాన్ని ధృవీకరించారు. చౌహాన్ మృతదేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం ఎయిర్ అంబులెన్స్ నుండి ఖండ్వా ఎయిర్‌స్ట్రిప్‌కు తీసుకువస్తామని, అక్కడి నుంచి బుర్హాన్‌పూర్‌కు తీసుకెళ్తామని చెబుతున్నారు. అంత్యక్రియలు స్వస్థలమైన షాపూర్‌లో జరుగుతాయని భావిస్తున్నారు.