Boy Thrashed in MP: మధ్యప్రదేశ్ జైన్ ఆలయంలో దారుణం, బాలుడ్ని కట్టేసి కొట్టిన ఇద్దరు వ్యక్తులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం మోతినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బాలుడు ఆలయ గేటు వద్ద ఉండగా రాకేష్ అతడిని తన నిర్బంధంలోకి తీసుకున్నాడు.
Bhopal, SEP 10: మధ్యప్రదేశ్‌లోని జైన్ ఆలయంలో (Siddhayatan Jain temple) దారుణ ఘటన వెలుగుచూసింది. బాలుడి చేతులను తాళ్లతో కట్టి ఆపై చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. బాలుడిని నిర్భందించి, వేధించినందుకు నిందితుడు రాకేష్ జైన్‌పై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సాగర్ నగరంలోని సిద్ధయతన్ జైన్ ఆలయంలో (Siddhayatan Jain temple) ఈ ఘటన జరిగింది. బాలుడిని ఇద్దరు వ్యక్తులు చెట్టుకు కట్టేసి హింసిస్తుండటంతో బాలుడు సాయం కోసం అరస్తుండటం వీడియోలో కనిపించింది. ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి వారించగా నిందితులు బెదిరించడంతో వారు వెనుతిరిగారు.
कहते हैं बच्चे भगवान का रूप होते हैं लेकिन मध्य प्रदेश के सागर में बच्चों के साथ किए जा रहे व्यवहार का एक अलग ही रूप देखने को मिल रहा है.. यहां एक बच्चे को रस्सी से बांधकर पीटा गया.@MPDial100@DGP_MP#MadhyaPradesh #sagar #SocialJustice pic.twitter.com/xdFxnr9lyH
— Shalini Singh (@shalinisengar23) September 10, 2022
ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం మోతినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బాలుడు ఆలయ గేటు వద్ద ఉండగా రాకేష్ అతడిని తన నిర్బంధంలోకి తీసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Sep 10, 2022 02:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

