MP Shocker: చెత్త కుప్పల్లోకి లాక్కెళ్లి చిన్నారిపై అత్యాచారం, ఆపై చేతిలో రూ.5 పెట్టిన కామాంధుడు, మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చెత్త కుప్ప దగ్గర 8 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి, ఆమెకు రూ .5 ఇచ్చిన దారుణ ఘటన (Brutality shames MadhyaPradesh) భోపాల్‌లో చోటు చేసుకుంది. భోపాల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ‘‘ భోపాల్ అయోధ్య నగర్‌కు చెందిన 8 ఏళ్ల బాలిక శనివారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బాలికకు రూ. 100 ఇచ్చి పొగాకు పొట్లాలు తీసుకురావాల్సిందిగా చెప్పాడు. పాప పొగాకు పొట్లాలు తెచ్చి అతడికి ఇచ్చింది.
Bhopal, Mar 22: చెత్త కుప్ప దగ్గర 8 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి, ఆమెకు రూ .5 ఇచ్చిన దారుణ ఘటన (Brutality shames MadhyaPradesh) భోపాల్‌లో చోటు చేసుకుంది. భోపాల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ‘‘ భోపాల్ అయోధ్య నగర్‌కు చెందిన 8 ఏళ్ల బాలిక శనివారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బాలికకు రూ. 100 ఇచ్చి పొగాకు పొట్లాలు తీసుకురావాల్సిందిగా చెప్పాడు. పాప పొగాకు పొట్లాలు తెచ్చి అతడికి ఇచ్చింది.
అయితే, అతడు వాటిని తీసుకోకుండా కొద్ది దూరంలో మరో వ్యక్తి ఉన్నాడని అతడికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో చిన్నారి నడుచుకుంటూ ముందుకు వెళ్లింది. అతడు పాపను అనుసరించి, చెత్త కుప్పల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఐదు రూపాయలు పాప చేతిలో పెట్టి, విషయం ఏవరికీ చెప్పొద్దని (buys her silence with Rs 5) బెదిరించాడు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయం అమ్మమ్మకు చెప్పింది. దీంతో ఆమె పాపను అయోధ్య నగర్ పోలీస్ స్టేషన్‌ను తీసుకెళ్లింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాప ఆ వ్యక్తిని రెండు సార్లు మాత్రమే చూసినట్లు పోలీసులకు చెప్పింది. ఆ రోజు ఆ ఏరియాలో తిరిగిన 40 మంది ఫొటోలను చూపించగా.. రవి అనే 30 ఏళ్ల వ్యక్తిని గుర్తించింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి భార్య అతడితో విడిపోయి వేరుగా ఉంటోందని విచారణలో తేలింది. అత్యాచారం కారణంగా పాప తీవ్రమైన షాక్‌కు గురైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పాప శారీరక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. కాగా నిందితుడు మైనర్ బాలిక తండ్రి వయస్సులో ఉన్నాడు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితుడుపై కేసు నమోదైంది.
(The above story first appeared on LatestLY on Mar 22, 2021 06:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

