Mumbai Shocker: 18 నెలల కుమార్తెను చంపి శ్మశానంలో పాతిపెట్టిన తల్లిదండ్రులు, అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖతో బయటపడ్డ అసలు నిజం
దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమార్తెను రహస్యంగా చంపారు. చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టారు. అయితే దీని గురించి పోలీసులకు లేఖ అందింది. దీంతో దర్యాప్తు జరిపి ఆ భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. (Couple Secretly Kills Daughter) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Mumbai, April 11: దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమార్తెను రహస్యంగా చంపారు. చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టారు. అయితే దీని గురించి పోలీసులకు లేఖ అందింది. దీంతో దర్యాప్తు జరిపి ఆ భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. (Couple Secretly Kills Daughter) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల జాహిద్ షేక్, 28 ఏళ్ల నూరామి భార్యాభర్తలు. వారికి 18 నెలల వయసున్న కుమార్తె లబీబా ఉంది. అయితే మార్చి 18న ఆ దంపతులు తమ కుమార్తెను హత్య చేశారు. స్థానిక శ్మశానవాటికలో రహస్యంగా పాతిపెట్టారు. కాగా, ఈ సంఘటన జరిగిన మూడు వారాల తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ స్థానిక పోలీసులకు అందింది. దీంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు. పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిర్వహించగా ఆ పసి పాప తల, శరీరంపై గాయాలున్నట్లు తేలింది.
మరోవైపు ఆ చిన్నారి తల్లిదండ్రులైన జాహిద్ షేక్, నూరామిని పోలీసులు ప్రశ్నించారు. తొలుత కట్టుకథ చెప్పిన వారిద్దరూ తమ కుమార్తెను చంపినట్లు చివరకు ఒప్పుకున్నారు. అయితే ఎందుకు హత్య చేశారో అన్నది వెల్లడించలేదు. బుధవారం ఆ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్నారు. పసి పాపను ఎందుకు చంపారో అన్నది ఆరా తీస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 11, 2024 09:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

