COVID-19 in India: దేశంలో తగ్గిపోతున్న కేసులు, కొత్తగా 41,506 మందికి కోవిడ్, 24 గంటల్లో కరోనాతో 895 మంది మృతి, ఢిల్లీలో ప్రారంభమైన అన్‌లాక్ ప్రక్రియ
Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, july 11: దేశంలో గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 41,506 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (COVID-19 in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24గంటల్లో కరోనాతో 895 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్‌తో మృతి చెందినవారి మొత్తం సంఖ్య 4,08,040కి (New COVID-19 Cases) చేరింది.

గడిచిన ఒక్కరోజులో 41,526 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ అస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2,99,75,064కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 4,54,118 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 37.60 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

కరోనావైరస్ కేసులు తగ్గిన నేపధ్యంలో ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ నేపధ్యంలో చాలా సంస్థలు తెరుచుకున్నాయి. కాగా గడచిన వారం రోజుల కరోనా గణాంకాలను పరిశీలిస్తే కేసులలో పెరుగుదల కనిపించకపోవడం గమనార్హం. గడచిన వారం రోజులలో ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య వంద దాటకపోవడం విశేషం. దీనిని గమనించిన వైద్య నిపుణులు దేశ రాజధానిలో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదని చెబుతున్నారు. దీనికితోడు ఢిల్లీవాసులు కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్నారని అందుకే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందన్నారు.

కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన డీకే శివకుమార్, సామాజిక దూరం పాటించక పోవడం వల్లే తనకు కోపం వచ్చిందని వివరణ

ఇదేవిధంగా ప్రజలంతా వ్యవహరిస్తే కరోనా థర్ఢ్‌వేవ్ రాదని చెబుతున్నారు. ఢిల్లీలో గడచిన వారంలో మొత్తం 570 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నమోదైన కరోనా కేసులలో ఇదే అత్యల్పం. దీనికి ముందు వారంలో మొత్తం 614 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వారంలో కరోనా కేసులు వ్యాప్తి రేటు 0.15 కన్నా తక్కువగా ఉంది. ఢిల్లీలో కరోనా కేసుల తగ్గుదల గురించి ఎయిమ్స్ డాక్టర్ యుద్ధవీర్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీలో కరోనా సెకెండ్ వేవ్‌లో సుమారు 80 శాతం జనాభాకు వైరస్ సంక్రమించడంతో, వారిలో యాంటీబాడీలు తయారయ్యాయని అందుకే కరోనా వ్యాప్తికి అడ్డుకట్టపడిందని తెలిపారు.