Jabardasth Rashmi: అనసూయను ఘోరంగా అవమానించిన యాంకర్ రష్మీ గౌతం, తనకు క్యారెక్టర్ మాత్రమే ముఖ్యమని, డబ్బు ముఖ్యం కాదని చెప్పిన రష్మీ

జబర్దస్త్ వేదికగా స్టార్ స్టేటస్ అందుకున్న యాంకర్ రష్మీ గౌతమ్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జబర్దస్త్ స్టేజ్ మల్లెమాల లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బల్ల గుద్ది మరీ చెప్పింది.

Jabardasth Rashmi: అనసూయను ఘోరంగా అవమానించిన యాంకర్ రష్మీ గౌతం, తనకు క్యారెక్టర్ మాత్రమే ముఖ్యమని, డబ్బు ముఖ్యం కాదని చెప్పిన రష్మీ
Anasuya Bharadwaj (Photo Credits: Twitter)

జబర్దస్త్ వేదికగా స్టార్ స్టేటస్ అందుకున్న యాంకర్ రష్మీ గౌతమ్,  తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,  జబర్దస్త్ స్టేజ్ మల్లెమాల లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బల్ల గుద్ది మరీ చెప్పింది.  ఈరోజు తను ఏమి ఉన్నప్పటికీ అదంతా మల్లెమాల వల్లే సాధ్యమైందని  పరోక్షంగా అనసూయ కౌంటర్ ఇచ్చింది.  గతంలో చాలాసార్లు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి,  మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ హడావిడి చేసింది ఇలా రెండు మూడు సార్లు జరిగింది.  కానీ రష్మీ గౌతమ్ మాత్రం జబర్దస్త్ యాంకర్ గా కంటిన్యూ అవుతుంది.  సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని చేస్తూనే రష్మీ జబర్దస్త్ లో కూడా కంటిన్యూ అవుతోంది.  కానీ అనసూయ మాత్రం వరుస సినిమాల్లో బిజీగా ఉండటంతో పాటు,  స్టార్ మా లో ఎక్కువ పారితోషికం కోసం షిఫ్ట్ అయిపోవడం చూసాము.  ఇదిలా ఉంటే రష్మి గౌతమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నేరుగా అనసూయ క్యారెక్టర్ ను దెబ్బతీసేలా ఉన్నాయని ఆమె ఫ్యాన్స్ నెట్టింట వాపోతున్నారు. 

నిజానికి జబర్దస్త్ కు తొలి యాంకర్ గా అనసూయ వ్యవహరించారు.  అంతేకాదు ఆ షో సక్సెస్ వెనుక అనసూయ చేయి బలంగా ఉంది.  అలాగే జబర్దస్త్ మూల స్తంభాలలో ఒకరైన నాగబాబు,  రోజా,  అనసూయ ఇప్పుడు ముగ్గురు దూరమవడం ఒక రకంగా చెప్పాలంటే మల్లెమాల కు పెద్ద అనే  చెప్పాలి.  అయితే ప్రస్తుతం ఇటువంటి వ్యాఖ్యలు నేరుగా అనసూయను టార్గెట్ చేసినవే అని ఆమె అభిమానులు వాపోతున్నారు.  తాను ఎక్కడికి వెళ్లినా జబర్దస్త్ మాత్రం వదిలేది లేదని.  రష్మీ బల్లగుద్ది మరీ చెప్పడం విశేషం.

చంద్రబాబు ప్రచార పిచ్చికి పేదలు బలి, మరణాలన్నిటికి చంద్రబాబు బాధ్యత వహించాలి, బాధితులను పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి రజిని

 ఈ సందర్భంగా సుడిగాలి సుదీర్ విషయంలో కూడా  రష్మి మాట్లాడింది.  కొందరు కేవలం డబ్బు కోసమే  వదిలి వెళ్తున్నమని చెప్పడం చాలా పెద్ద జోక్ అని రష్మీ చెప్పడం విశేషం.  అయితే త్వరలోనే సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో కనిపించాలంటే మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. 

(The above story first appeared on LatestLY on Jan 02, 2023 11:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).