Anti-CAA Rangoli Protest: తమిళనాడు ముగ్గుల వెనుక పాకిస్తాన్ హస్తం, ముగ్గులు వేసిన యువతి గాయత్రి కందదైకు పాక్ బైట్స్‌ ఫర్‌ ఆల్‌ సంస్థతో సంబంధాలు, మీడియాకు వెల్లడించిన గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌
Pakistan link emerges to anti-CAA protests in Tamil Nadu (Photo Credits: Twitter)

Chennai,January 3: తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టంపై వివిధ రకాలుగా నిరసనలు జరిపిన సంగతి విదితమే. ఇందులో ప్రధానంగా సంచలనం రేపింది ఏదైనా ఉందంటే అది రంగోలి(Rangoli) ద్వారా నిరసన తెలపడం. దీనికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి ఆ తర్వాత వారిని విడుదల చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పౌరసత్వ చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో ఒక యువతి వేసిన ముగ్గు (Andal draw Kolams)వెనుక మర్మం దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సదరు యువతికి పాకిస్థాన్‌ (Pakistan) సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఫేస్‌బుక్‌ పరిశీలనలో తేలిందని గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ (City Police Commissioner A K Viswanathan) తెలిపారు.

యోగీ ప్రభుత్వం ప్రతీకార నిర్ణయం

ముగ్గులు వేసిన గాయత్రి కందదైకు(Gayathri Kandhadai) పాకిస్థాన్‌లోని ‘బైట్స్‌ పార్‌ ఆల్‌’ (Bytes For All )అనే సంస్థతో సంబంధాలున్నట్లు ఆమె ఫేస్‌బుక్‌ తనిఖీలో తేలిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సంస్థకు అసోసియేషన్‌ ఆఫ్‌ అల్‌ పాకిస్థాన్‌ సిటిజన్‌ జెనలిస్ట్‌ అనే సంస్థకు సొంతమైందని, అంతేకాకుండా ఆమె నేపథ్యాన్ని కూడా అనుమానిస్తున్నామన్నారు. తీవ్రవాద సంస్థలతో గాయత్రికి, ఆమె తండ్రికి ఏమైనా సంబంధాలున్నాయా..? అనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు.

వారి అరెస్ట్ గురించి కమిషనర్ విశ్వనాధన్ మాట్లాడుతూ.. ముగ్గు వేసినందుకు యువతులను అరెస్ట్‌ చేయలేదని, ఇతరులు వేసుకున్న సాధారణ ముగ్గు పక్కనే పౌర చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో కూడిన ముగ్గువేయడం వల్లనే అరెస్ట్‌ చేసి కొద్దిసేపటికే విడిచిపెట్టామని కమిషనర్‌ వెల్లడించారు.

నిరసనల పేరుతో విధ్వంసం

చెన్నై నగరంలో గత నెల 29వ తేదీన పలువురు యువతులు ఇళ్ల ముందు ముగ్గులు వేసిన ఘటనలో ఎనిమిది మంది యువతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో బిసెంట్‌ నగర్‌లోని 92 ఏళ్ల వృద్ధుడి ఇంటి ముందు ముగ్గువేసి గొడవలు సృష్టించిన నేరంపై తిరువాన్మియూర్‌కు చెందిన గాయత్రి కందదై (32)ని కూడా అరెస్ట్‌ చేశారు.

వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండి, మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ చర్యను నిరసిస్తూ డీఎంకే అధినేత స్టాలిన్, తుత్తుకుడి ఎంపీ కనిమొళి ఇళ్ల ముందు కూడా ‘వేండం (వుయ్‌ డోంట్‌ వాంట్‌) సీఏఏ-ఎన్‌ఆర్సీ’ అంటూ ముగ్గులు వేశారు. ఇప్పటికీ అక్కడ నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు.