IPL Auction 2025 Live

Times Now ETG Survey: ఎవరికెన్ని సీట్లు, టైమ్స్‌ నౌ సర్వే పూర్తి వివరాలు ఇవిగో, మళ్లీ అధికారం మోదీ సర్కారుదే, ఏపీలో జగన్ సర్కారుకు, తెలంగాణలో కేసీఆర్‌కే మళ్లీ పట్టం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్‌ నౌ’సర్వే (Times Now ETG Survey) తేల్చి చెప్పింది.

Modi and Kcr, and Jagan (Photo-ANI)

New Delhi, August 17: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్‌ నౌ’సర్వే (Times Now ETG Survey) తేల్చి చెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు వస్తాయని సర్వేలో (Phir Ek Baar, Modi Sarkar) తేలింది.

ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని సర్వే స్పష్టం చేసింది.ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది.

సర్వే మళ్లీ జగన్ వైపే, 2024లో టీడీపీ, జనసేన గల్లంతేనంటున్న టైమ్స్ నౌ సర్వే, 23 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో జగన్ సర్కారు గెలుస్తుందని సర్వేలో వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్ (YCP To Sweep In Andhra Pradesh)‌ చేస్తుందని తేల్చింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్‌సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడయింది.అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. ఇక 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్‌ నౌ సర్వే తేల్చడం విశేషం.కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది.

వీడియో ఇదిగో, సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీ నేనే పరిచయం చేశాను, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్‌ఎస్‌) 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది. టైమ్స్‌ నౌ సర్వే పూర్తి వివరాలు ఇవిగో

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని సీట్లు

కూటమి/పార్టీ సీట్లు

వైఎస్సార్‌సీపీ 24–25

ఎన్డీయే 0–1

ఇండియా 0

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం

కూటమి/పార్టీ ఓట్ల శాతం

వైఎస్సార్‌సీపీ 51.3

ఎన్డీయే 1.13

ఇండియా –

తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు

కూటమి/పార్టీ సీట్లు

బీఆర్‌ఎస్‌ 9–11

ఎన్డీయే 2–3

ఇండియా 3–4

ఇతరులు 1

తెలంగాణలో ఓట్ల శాతం

కూటమి/పార్టీ ఓట్ల శాతం

బీఆర్‌ఎస్‌ 38.40

ఎన్డీయే 24.30

ఇండియా 29.90

ఇతరులు 7.40

జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543)

కూటమి సీట్లు

ఎన్డీయే 296–326 (ఓట్ల శాతం 42.60)

ఇండియా 160–190 (ఓట్ల శాతం 40.20)

పార్టీల వారీగా సీట్లు

బీజేపీ 288–314

కాంగ్రెస్‌ 62–80

వైఎస్సార్‌సీపీ 24–25

డీఎంకే 20–24

టీఎంసీ 22–24

బీజేడీ 12–14

బీఆర్‌ఎస్‌ 9–11

ఆమ్‌ ఆద్మీ పార్టీ 5–7

ఇతరులు 70–80

ఏ కూటమికి ఎన్ని సీట్లు

కూటమి సీట్లు ఓట్ల శాతం

ఎన్డీయే 296–326 42.60

ఇండియా 160–190 40.20

మొత్తం సీట్లు 543 –

ఏ పార్టీకి ఎన్ని సీట్లు

పార్టీ సీట్లు

బీజేపీ 288–314

కాంగ్రెస్‌ 62–80

వైఎస్సార్‌సీపీ 24–25

డీఎంకే 20–24

టీఎంసీ 22–24

బీజేడీ 12–14

బీఆర్‌ఎస్‌ 9–11

ఆప్‌ 5–7

ఇతరులు 70–80