Cash-rich Beggar: ఆ భిక్షగత్తె లక్షాధికారి, బ్యాంక్ ఖాతాలో రూ. 2 లక్షలు, చేతి పర్సులో రూ. 15 వేలు, అన్ని రకాల ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూసి అధికారులు షాక్
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Puducherry, November 7: విదేశాల్లో అడుక్కునే వాళ్లు ఎంతో స్టైల్ గా, ఉల్లాసంగా పాటలు పాడుతూ భిక్షం కోరతారు, అదే మన ఇండియాలో భిక్షగాళ్లకు టాలెంట్ ఎక్కువ మురికి బట్టలతో, అత్యంత దౌర్భాగ్య స్థితిలో, దీనమైన ముఖం పెట్టి కరుణ రసాన్ని చూపిస్తే, వారి చేతిలో ఎప్పుడూ పైసల గలగలలే. అలాంటి ఒక యాచకురాలిని  (Beggar Woman) చూసి అధికారులు షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే, పుదుచ్చేరి (Puducherry) లోని ఓ ఆలయ ప్రాంగణంలో పేవ్‌మెంట్‌ వద్ద కూర్చొని ఓ యాచకురాలు నిత్యం భక్తుల నుండి భిక్షం వేడుకుంటుంది. ఆలయం అభివృద్ధి పనుల్లో భాగంగా ఆమె భిక్షం అడుక్కునే పేవ్‌మెంట్‌ను ఆలయ అధికారులు క్లియర్ చేస్తున్నప్పుడు, ఆమెను ఆ స్థలాన్ని విడిచిపెట్టాల్సిందిగా కోరారు. అందుకు ఆమే ససేమీరా ఒప్పుకోలేదు, దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అంత తనిఖీ చేయగా ఆమె సంచీలో రూ. 15 వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ అన్నీ ఉన్నాయి. ఆమె బ్యాంక్ ఖాతాను చెక్ చేయగా, అందులో రూ. 2 లక్షల డిపాజిట్ ఉంది. దీంతో అధికారులు, పోలీసులు షాక్ అయ్యారు. ఇక ఆమె వివరాల ఆధారంగా తమిళనాడులోని కల్లకూరిచికే చెందిన పర్వతం (70) గా గుర్తించిన పోలీసులు ఆమె బంధువులకు సమాచారం అందించి, ఆ యాచకురాలిని తరలించారు.

ఒక నెల కిందట కూడా మొంబైలో రైల్వేట్రాక్ పై ఓ యాచకుడు చనిపోయాడు, పోలీసులు అతడి వివరాలు సేకరించగా అతడి ఖాతాలో రూ. 9 లక్షల డిపాజిట్లు గుర్తించారు.

కాబట్టి, ఇక్కడ నీతి ఏమంటే ఎవరినీ తక్కువ చేసి చూడొద్దు. మిమ్మల్ని అడుక్కునేది ఏ ఆల్ ఇండియా అడుక్కునే సంఘం అధ్యక్షుడు కూడా అయి ఉండొచ్చు, ఒకసారి డ్యూటీ దిగితే మీకంటే విలాసవంతమైన జీవితంలో గడపొచ్చు. అలాంటి వారి పట్ల హేపోపో, ఐ హేట్ బెగ్గర్స్ అంటూ అవమానకరంగా ప్రవర్తిస్తే మీకు బాబాబ్బాబ్.. బబబ్బాబ్బాబ్ మోత మోగిపోవచ్చు. జాగ్రత్త.