Remdesivir Update: కరోనాకు మందు వచ్చేసింది, మొదటి విడతగా 5 రాష్ట్రాలకు 20 వేల రెమ్డీస్వీర్‌‌ ఇంజక్షన్లను సరఫరా చేసిన హెటిరో సంస్థ, 3,4 వారాల్లో లక్ష ఇంజక్షన్లు అందుబాటులోకి

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (Coronavirus) కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఇది రోజు రొజుకు విశ్వరూపం చూపిస్తోంది. దీని విరుగుడుకు మందు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మా సంస్థ హెటిరో దీని నియంత్రణకు మందును (Hetero's Antiviral Drug) తయారుచేసినట్లు తెలిపింది. రెమ్డీస్వీర్‌ పేరుతో (Remdesivir Update) ఇంజక్షన్‌ రూపంలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది.కాగా కరోనా ఇంజక్షన్‌ తొలి బ్యాచ్‌ను ఐదు రాష్ట్రాలకు సరాఫరా చేసినట్లు హెటిరో సంస్థ తెలిపింది.

Remdesivir Update: కరోనాకు మందు వచ్చేసింది, మొదటి విడతగా 5 రాష్ట్రాలకు 20 వేల రెమ్డీస్వీర్‌‌ ఇంజక్షన్లను సరఫరా చేసిన హెటిరో సంస్థ, 3,4 వారాల్లో లక్ష ఇంజక్షన్లు అందుబాటులోకి
Hetero's COVIFOR antiviral drug for COVID-19. (Photo Credit: Twitter)

New Delhi, June 25: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (Coronavirus) కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఇది రోజు రొజుకు విశ్వరూపం చూపిస్తోంది. దీని విరుగుడుకు మందు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మా సంస్థ హెటిరో దీని నియంత్రణకు మందును (Hetero's Antiviral Drug) తయారుచేసినట్లు తెలిపింది. రెమ్డీస్వీర్‌ పేరుతో (Remdesivir Update) ఇంజక్షన్‌ రూపంలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది.కాగా కరోనా ఇంజక్షన్‌ తొలి బ్యాచ్‌ను ఐదు రాష్ట్రాలకు సరాఫరా చేసినట్లు హెటిరో సంస్థ తెలిపింది. కరోనా పని ఖతం అయినట్లేనా, కోవిఫర్ ఇంజక్షన్‌కు డిసిజిఐ అనుమతి, 100 మిల్లీగ్రాముల ఇంజెక్ష‌న్‌ ఖరీదు రూ.5000 నుంచి రూ.6000 మధ్య ఉండే అవకాశం

హెటిరో సంస్థ రెమ్డీస్వీర్‌ జనరిక్‌ మందును ఇంజక్షన్‌ రూపంలో తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. కోవిఫర్‌ బ్రాండ్‌ పేరుతో తొలి బ్యాచ్‌గా తయారు చేసిన 20 వేల ఇంజక్షన్లను తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మరో మూడు, నాలుగు వారాల్లో లక్ష ఇంజక్షన్లు తయారు చేయనున్నట్లు పేర్కొంది.

రెండవ బ్యాచ్‌ కరోనా ఔషధాన్ని కోల్‌కతా, ఇండోర్‌, భోపాల్‌, లక్నో, పాట్నా, భువనేశ్వర్‌, రాంచీ, విజయవాడ, కోచి, తిరువనంతపురం, గోవాకు సరఫరా చేయనున్నట్లు హెటిరో వెల్లడించింది. 100 మిల్లీగ్రాముల ఈ ఇంజక్షన్‌ ధర రూ.5,400గా హెటిరో తెలిపింది. ప్రస్తుతం ఈ కరోనా ఇంజక్షన్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉంటుందని, మందుల షాపుల్లో ఇప్పుడే లభించవని పేర్కొంది. మరోవైపు ఇదే జనరిక్‌ మందును తాము కూడా తయారు చేస్తున్నట్లు అమెరికా ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సిప్లా తెలిపింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 16,922 కేసులు, దేశంలో 4,73,105కు చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నెల రోజుల్లోనే మూడు లక్షల యాభైవేల కేసులు నమోదు

ఇంజక్షన్‌ ధర మాత్రం రూ.5000 లోపే ఉంటుందని చెప్పింది. కాగా, క్లినికల్‌ ట్రయల్స్‌తోపాటు అత్యవసర కరోనా రోగులకు ఈ ఇంజక్షన్‌ ఇచ్చేందేకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఈ యాంటీ వైరల్‌ మందు కరోనాను నియంత్రిస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, దక్షిణ కోరియా దీనిని పాక్షికంగా అనుమతించగా జపాన్‌ మాత్రం పూర్తిగా ఆమోదం తెలిపింది.

(The above story first appeared on LatestLY on Jun 25, 2020 04:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).