Gandhi Jayanti 2019: గాంధీజీ 150 జయంతి ఉత్సవాలు, దేశవ్యాప్తంగా 'మహత్మునికి' ఘనమైన నివాళి , రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ
Paying Homage to Mahatma Gandhi at Raj Ghat | File Photo

New Delhi, October 02 : మహాత్మా గాంధీగా  (Mahatma Gandhi) పేరుగాంచిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ముందుండి నడిపించి భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించడంలో కీలకభూమిక పోషించారు. రాజకీయాలకు అతీతంగా, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల శ్రేణులచే గౌరవింపబడే అదికొద్ది మంది రాజకీయ నాయకులలో గాంధీజీ ఒకరు. ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపిన మన జాతిపిత గాంధీజీ పుట్టినరోజైన అక్టోబర్ 02 ను ప్రతీ ఏడాది ఒక జాతీయ పండుగగా 'గాంధీ జయంతి' (Gandhi Jayanti)  గా జరుపుకుంటున్నాము. నేడు గాంధీజీ 150వ జయంతి (150th Birth Anniversary)  సందర్భంగా, దేశం యావత్తు ఆ మహత్ముడి సేవలను మరోసారి స్మరించుకుంటూ ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తుంది.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind), ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకురాలు సోనియా గాంధీ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఢిల్లీలోని 'రాజ్ ఘాట్' కు చేరుకొని ఆయన సమాధి వద్ద అంజలి ఘటించారు.

గాంధీజీ పంచిన సత్యం, అహింస, సామరస్యం, నైతికత మరియు నిరాడంబరత విలువలు మనందరం మనకు మనముగా అంకితం చేసుకునే సందర్భం ఇది. మహాత్ముడు జాతికి ఇచ్చిన సందేశం అందరూ అనుసరించాలి, ఆయన అడుగుజాడలు నేటికి మార్గదర్శకాలు అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

Prez Ramnath Kovind's tweet

మహాత్మా గాంధీ వ్యక్తిత్వం, ఆయన ఆలోచనల శక్తి, ప్రపంచంపై ఆయన ప్రభావం అనంతమైనది, ఎంతో గొప్పది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాంతి, సామరస్యాలకు మరియు సోదరభావాలకు గాంధీజి చూపిన నిబద్ధత, పేదల అభ్యున్నతికి ఆయన పాటుపాడిన తీరు నేటికి ఆదర్శనీయం అని మోదీ కొనియాడారు.

PM Modi's Tweet

ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని , అహ్మదాబాద్ సబర్మతీ తీరంలోని గాంధీజీ ఆశ్రమంలో కూడా బాపూజీకి నివాళులు అర్పించనున్నారు. అనంతరం గుజరాత్ లో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో కూడా మోదీ పాల్గొననున్నారు.