UP Shocker: యూపీలో దారుణం, పెళ్లికి ముందే యువతిపై గ్యాంగ్ రేప్, అనంతరం రాజకీయ నేతకు విక్రయించడంతో అతనూ రేప్ చేసి మరొకరికి విక్రయం
యూపీలో మరో దారుణం జరిగింది. శుభలేఖలు పంచేందుకు వెళ్లిన 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆపై విక్రయించారు. ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 21న బాధిత యువతి వివాహం జరగాల్సి ఉంది. దీంతో 18న పెళ్లి శుభలేఖలు పంచేందుకు (woman kidnapped while distributing her wedding cards) వెళ్లింది.
Lucknow, May 10: యూపీలో మరో దారుణం జరిగింది. శుభలేఖలు పంచేందుకు వెళ్లిన 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆపై విక్రయించారు. ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 21న బాధిత యువతి వివాహం జరగాల్సి ఉంది. దీంతో 18న పెళ్లి శుభలేఖలు పంచేందుకు (woman kidnapped while distributing her wedding cards) వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆమెను తమతోనే ఉంచుకున్న యువకులు అనంతరం ఓ రాజకీయ పార్టీ నేతకు (gang raped and sold) అప్పగించారు. ఆయన కొన్ని రోజులపాటు ఆమెను బంధించాడు. నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం, యువతిపై కాల్పులు జరిపి తను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, పెళ్లికి నిరాకరించడంతో ఘటన
అనంతరం పక్కనే ఉన్న మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు ఆమెను పంపించాడు. అక్కడి నుంచి ఎలాగోలా తన తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను రక్షించారు. తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై విక్రయించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెహరౌలి సర్కిల్ ఆఫీసర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(The above story first appeared on LatestLY on May 10, 2022 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

