Uttar Pradesh Horror: విద్యార్థులు కాదు కామాంధులు, ట్యూషన్ టీచర్ సెక్స్‌కు ఒప్పుకోలేదని బ్లాక్ మెయిల్, ఆమె అశ్లీల వీడియో సోషల్ మీడియాలో పోస్ట్

యూపీలో ఆగ్రా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలి అశ్లీల వీడియోను విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఒక పేజీని తెరిచి పోస్ట్‌ చేశారు. దీంతో బాధిత టీచర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Uttar Pradesh Horror: విద్యార్థులు కాదు కామాంధులు, ట్యూషన్ టీచర్ సెక్స్‌కు ఒప్పుకోలేదని బ్లాక్ మెయిల్, ఆమె అశ్లీల వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
Uttar Pradesh Student Posts Obscene Video Of Teacher On Instagram; 4 Detained

Lucknow, Oct 6: యూపీలో ఆగ్రా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలి అశ్లీల వీడియోను విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఒక పేజీని తెరిచి పోస్ట్‌ చేశారు. దీంతో బాధిత టీచర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఒక మహిళ, మధురలోని స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నది. చదువులో వెనుకబడి ఉన్న పదో తరగతి విద్యార్థికి ప్రత్యేకంగా ట్యూషన్‌ చెప్పింది. అయితే టీచర్ కొంచెం చనువు ఇవ్వడంతో విద్యార్థి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓ రోజు టీచర్‌ అశ్లీల వీడియోను ఆ స్టూడెంట్‌ తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీంతో టీచర్‌ అతడికి దూరంగా ఉండసాగింది.

వీడియో ఇదిగో, కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న విద్యార్థులను అది చూపాలంటూ వేధించిన కామాంధులు, పొలాల్లో గుండా పెరిగెడుతూ..

ఆ విద్యార్థి కోపంతో టీచర్‌ అశ్లీల వీడియోను ముగ్గురు స్నేహితులకు పంపాడు. వారు దానిని వాట్సాప్‌లో మరికొందరికి షేర్‌ చేశారు. అలాగే వారంతా కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని క్రియేట్‌ చేశారు. బాధిత టీచర్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో మిషన్ శక్తి అభయాన్‌ కేంద్రానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. విద్యార్థుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది.

మరోవైపు ఆ కేంద్రం మద్దతు, వారి ధైర్యంతో పోలీసులకు ఆ టీచర్‌ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మైనర్లా కాదా అన్నది ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 06, 2024 08:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).