Maharashtra Politics: సంక్షోభంలో ఉద్ధవ్ థాకరే సర్కారు, 21 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్, మహా సంక్షోభానికి తెర లేపబోతున్న శివసేన పార్టీ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఊహించని పరిణామాలు (Maharashtra Political Crisis) జరుగుతున్నాయి. అధికార కూటమిలోని శివసేన పార్టీ ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde ) వేరు కుంపటితో.. మహా వికాస్‌ అఘాడి కూటమిని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నారు.

Maharashtra Politics: సంక్షోభంలో ఉద్ధవ్ థాకరే సర్కారు, 21 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్, మహా సంక్షోభానికి తెర లేపబోతున్న శివసేన పార్టీ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే
uddhav-Thackeray (credit- fb , PTI

Mumbai, June 21: మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఊహించని పరిణామాలు (Maharashtra Political Crisis) జరుగుతున్నాయి. అధికార కూటమిలోని శివసేన పార్టీ ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde ) వేరు కుంపటితో.. మహా వికాస్‌ అఘాడి కూటమిని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నారు. గుజరాత్‌ సూరత్‌లోని ఓ హోటల్‌లో ఆయన మరికొందరు ఎమ్మెల్యేలతో క్యాంప్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు సుమారు 21 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.

సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి ప్రతిపక్ష బీజేపీ పార్టీ షాక్‌ ఇవ్వగా.. మంగళవారం ఎమ్మెల్యే గుజరాత్‌లోని సూరత్‌ చేరుకున్నారు. వీరంతా గుజరాత్‌కు చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఉద్ధవ్‌ థాకరే సర్కారు (Maharashtra government) చిక్కుల్లో పడ్డట్లయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఇవాళ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండేతో 21 మంది ఎమ్మెల్యేలు గుజరాత్‌లోని ఓ హోటల్‌లో క్యాంప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏక్‌నాథ్‌ షిండే సోమవారం నుంచి పార్టీకి అందుబాటులో లేకుండాపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత నారాయణ్‌ రాణేను ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు. కాగా మహారాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఎన్నికలు సోమవారం జరిగాయి. ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. పది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార మహా వికాస్‌ అఘాదికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

వైరల్ వీడియో.. 7 వేల ఫీట్ల ఎత్తులో జవాన్లు యోగసనాలు, అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పురస్కరించుకుని యోగసనాలు వేసిన ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీసులు

ప్రతిపక్ష బీజేపీ ఐదుస్థానాల్లో గెలుపొందగా.. శివసేన, ఎన్‌సీపీ పార్టీలు చెరో రెండు స్థానాల్లో, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించింది. రాజ్యసభ ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. 55 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు మద్దతిచ్చిన కేవలం శివసేనకు 52 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌ దళిత అభ్యర్థి చంద్రకాంత్ హందోరే ఓటమికి సొంత పార్టీ ఎమ్మెల్యేల క్రాసింగ్‌ ఓటమే కారణమంటూ కార్యకర్తలూ నిరసనలకు దిగారు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే రాజ్యసభ ఎన్నికల అనంతరం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీలో ఉత్సాహం నెలకొన్నది. ఎన్నికల ఫలితాలపై సంతోషంగా ఉన్నామని బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ దారేకర్ అన్నారు. బీజేపీపై మహారాష్ట్ర విశ్వాసం చూపిందన్నారు. అయితే, శివసేన, కాంగ్రెస్ సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్‌ నేత జగ్‌తాప్‌ ఆరోపించారు. ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

థానేకు చెందిన ప్రముఖ నేతగా ఏక్‌నాథ్‌ షిండే.. ఆ ప్రాంతంలో శివ సేన బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అయితే తన శాఖల్లో(అర్బన్‌ డెవలప్‌మెంట్‌తో పాటు పబ్లిక్‌ వర్క్స్‌) సీఎం ఉద్దవ్‌ థాక్రే, ఆయన తనయుడు టూరిజం మంత్రి అయిన ఆదిత్యా థాక్రేల జోక్యం ఎక్కువగా ఉండడంతో ఆయన రలిగిపోతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ నుంచి నిధుల కేటాయింపుల విషయంలోనూ షిండేతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లంతా సూరత్‌ హోటల్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు శివ సేన చీలికను ఎన్సీపీ, కాంగ్రెస్‌లు పరిశీలిస్తున్నాయి. మహారాష్ట్రంలో శివ సేన, కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సంయుక్తంగా మహా వికాస్‌ అగాధి(ఎంవీఏ) కూటమిగా.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 10న రాజ్యసభ ఎన్నికల్లో ఎంవీఏను ఓడించడంలో బీజేపీ విజయం సాధించగా.. ఇప్పుడు రెండు వారాల వ్యవధిలో కూటమికి ఎమ్మెల్సీ ఫలితంతో మరో షాక్‌ ఇచ్చింది. తాజా పరిణామాలతో ఢిల్లీ మాజీ సీఎం ఫడ్నవిస్‌ ఢిల్లీకి పయనమైనట్లు తెలుస్తోంది.

(The above story first appeared on LatestLY on Jun 21, 2022 01:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).