
రోజంగా చాలా హుషారుగా పనిచేయాలంటే పరిగడుపున తినే ఆహారం స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీలకర్ర గురించి. రాత్రి సమయంలో జీలకర్రను నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. దాంతో అది కడుపును మొత్తం ఖాళీ చేస్తుంది. కడుపులోని చెడు పదార్థాలను బటయకు పంపేస్తుంది. ఆరోగ్యంగా ఉంటాం.
ఇక అన్నింటికంటే గొప్ప పండు బొప్పాయి. ప్రతి ఒక్కరు ఉదయాన్నే దీన్ని తినాలంటూ చెబుతున్నారు. దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని చెడు కొవ్వును ఈజీగా కరిగించేస్తుంది. దీని వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.
మరో అద్భుతమైన ఆహారం డ్రై ఫ్రూట్స్. రాత్రి నీటిలో నానబెట్టిన కొన్ని డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే రోజంగా యాక్టివ్ గా ఉంటాం. ముఖ్యంగా నానబెట్టిన బాదం తింటే మరీ మంచిది. బాదంపప్పు, వాల్నట్స్, ఎండిన అత్తిపండ్లను తింటే అన్నింటికంటే మంచిది.