WHO on COVID: కరోనా కారణంగా తగ్గిన మనిషి ఆయుష్షు కాలం, ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో
కోవిడ్ కారణంగా మనుషుల ఆయుష్షు కాలం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజా నివేదిక వెల్లడించింది. ఈ కరోనా మనుషుల జీవిత కాలాన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గించిందని నివేదికలో చెప్పింది. భారత దేశంలో పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని అది ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది.

కరోనా మహమ్మారికి ముందు.. 2019లో భారత్ లో పౌరుల ఆయుర్దాయం 73 ఏళ్లుగా ఉండేదని వివరించింది. ఆ తర్వాత 2012లో భారత్ లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్లకు కాస్త అటూఇటూగా ఉండేదని, అనంతరం కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది. తాజాగా 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది. అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా 61 ఏళ్లకు తగ్గిపోయిందని వివరించింది. ఆపరేషన్ కత్తులని ఉపయోగించకుండా బాలిక ఊపిరితిత్తుల నుంచి సూదిని తొలగించిన వైద్యులు, వీడియో ఇదిగో..
డబ్ల్యూహెచ్ వో విడుదల చేసిన వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ తాజా జాబితా ప్రకారం.. అమెరికా, ఈశాన్య ఆసియాలో 2019 నుంచి 2021 మధ్య మనిషి ఆయుర్దాయం మూడేళ్లు తగ్గిపోయింది. అదే సమయంలో ఆరోగ్యకరమైన జీవిత కాలం రెండున్నర సంవత్సరాలు తగ్గింది. అయితే దీని ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉందని డబ్ల్యూహెచ్ వో సైంటిస్టులు చెప్పారు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆయుర్దాయంపై కరోనా ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో మనిషి ఆయుర్దాయం ఏడాది కన్నా తక్కువగానే పడిపోయిందని, ఆరోగ్యకరమైన జీవన కాలం కూడా రెండేళ్ల కన్నా తక్కువేనని వివరించారు.
(The above story first appeared on LatestLY on May 28, 2024 04:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).