Republic Day Offers: సామ్సంగ్ టీవీ కొంటే సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఉచితం, 'రిపబ్లిక్ డే సేల్' ఆఫర్స్ ప్రకటించిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, జనవరి 31 వరకు చేసే కొనుగోళ్లపై బహుమతులు, ఫైనాన్స్ ఆఫర్లు

వినియోగదారులు వారు కొనుగోలు చేసే స్క్రీన్ పరిమాణం ఆధారంగా ఈ బహుమతులు, ఈఎంఐ ఆఫర్లు వర్తించనున్నాయి. అలాగే టీవీలపై వారంటీ 2 సంవత్సరాల పాటు లభించనుంది. జనవరి 31 వరకు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ వర్తిస్తాయని సంస్థ తెలిపింది....

Republic Day Offers: సామ్సంగ్ టీవీ కొంటే సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఉచితం, 'రిపబ్లిక్ డే సేల్' ఆఫర్స్ ప్రకటించిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, జనవరి 31 వరకు చేసే కొనుగోళ్లపై బహుమతులు, ఫైనాన్స్ ఆఫర్లు
Samsung QLED TV | Photo: Samsung UK

Hyderabad, January 21:  కన్స్యూమర్ ఉపకరణాల దిగ్గజం సామ్సంగ్ (Samsung) రిపబ్లిక్ డే సందర్భంగా తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను (Republic Day Sale Offers) ప్రకటించింది. టెలివిజన్లు (TVs), వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు మరియు మైక్రోవేవ్ ఓవెన్ల కొనుగోళ్లపై వేర్వేరు ఆఫర్లను అందిస్తోంది. అదనంగా, ప్రతీ కొనుగోలుపై 15 శాతం క్యాష్ బ్యాక్ మరియు ఈజీ ఈఎంఐ పథకాలను కూడా అందిస్తోంది. జనవరి 31, 2020 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందని సామ్సాంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.

సామ్సాంగ్ ఉత్పత్తులైన QLED టీవిలు, 4K UHD టీవిలు మరియు మైక్రోవేవ్ ఓవెన్‌లు వంటి కొనుగోళ్లకు ఈ ఉచిత మొబైల్ ఫోన్ ఆఫర్ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మరియు ఎయిర్ కండీషనర్లపై బహుమతులతో పాటు ఫైనాన్స్ ఆఫర్లను కూడా అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

ఇక ప్రస్తుతం ప్రారంభమైన ఆఫర్‌లో భాగంగా, సామ్‌సంగ్ క్యూఎల్‌ఇడి మరియు 4 కె యుహెచ్‌డి టీవిల యొక్క కొన్ని మోడళ్లను కొనుగోలు చేసే వినియోగదారులకు ఖచ్చితమైన బహుమతులు లభిస్తాయి. ఈ ఆఫర్ కింద ఉచితంగా లభించే స్మార్ట్‌ఫోన్ ల వివరాలు ఇలా ఉన్నాయి: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10, 512 జీబి వేరియంట్ బహుమతిగా పొందవచ్చు. దీని ధర రూ. 76,900 గా ఉంది. అంతేకాకుండా ధర రూ. 19,999 గల గెలాక్సీ ఎ50ఎస్ స్మార్ట్‌ఫోన్, రూ. 16,999 విలువ గల గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్, రూ. 8,499 ధర గల గెలాక్సీ ఎ 10ఎస్ స్మార్ట్‌ఫోన్, మరియు రూ. 3,799 విలువ గల సామ్‌సంగ్ యుఫ్లెక్స్ హెడ్‌ఫోన్స్ బహుమతులుగా లభించనున్నాయి.

అదనంగా 30 రోజుల పాటు జీ5 ఉచిత సబ్స్ క్రిప్షన్ లభించనుంది.

వినియోగదారులు వారు కొనుగోలు చేసే స్క్రీన్ పరిమాణం ఆధారంగా ఈ బహుమతులు, ఈఎంఐ ఆఫర్లు వర్తించనున్నాయి. అలాగే టీవీలపై వారంటీ 2 సంవత్సరాల పాటు లభించనుంది. జనవరి 31 వరకు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ వర్తిస్తాయని సంస్థ తెలిపింది.

(The above story first appeared on LatestLY on Jan 21, 2020 05:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).