ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేషన్ (AP PGCET 2022 Notification) బుధవారం రాత్రి విడుదలైంది. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ సూర్య కళావతి ఈ నోటిఫికేషన్ను విడుదల (AP PGCET 2022 Notification Released) చేశారు.
...