మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళి అర్పించింది. కాసేపటి క్రితం అంతిమయాత్ర ప్రారంభంకాగా అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌సింగ్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
...