బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే వారంలో దక్షిణ, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతమైన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వివరణాత్మక హెచ్చరిక జారీ చేసింది.
...