1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తుండాను టెర్రరిస్ట్ అండ్ యాంటీ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ (టాడా) కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు తుండాను నిర్దోషిగా ప్రకటించింది. అబ్దుల్ కరీం తుండాపై ఎలాంటి బలమైన సాక్ష్యాలను సమర్పించడంలో సీబీఐ విఫలమైందని తుండాకు చెందిన న్యాయవాది షఫ్కత్ సుల్తానీ అన్నారు.
...