హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో అక్రమసంబంధం ఉందన్న ఆరోపణలతో బకింగ్‌హామ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేమ్స్ టూలీపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేగాదు విచారణలో యూనివర్శిటీ ఫీజు చెల్లించడంలో అతడు ఆమెకు సహాయం చేసినట్లు సమాచారం. 65 ఏళ్ల ప్రొఫెసర్ టూలీతో తనకు లైంగిక సంబంధం ఉందని భారతీయ మహిళ తన డైరీలో పేర్కొంది. యువతి రాసిన డైరీల కాపీలను ప్రొఫెసర్ భార్య యూనివర్సిటీకి అందజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
...