ఓ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో ఒకటి రీఛార్జ్‌బుల్ టాయ్(Rechargeable toy) ఉంది. దాన్ని తీసి రీఛార్జ్ పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయింది. దీంతో పెళ్లి కుమారుడు(Groom), పక్కనే ఉన్న పెళ్లి కుమార్తె (Bride) కూడా తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలోని మింధబారి గ్రామంలో మే 12వ తేదీన లతీష్ గవిత్, సల్మాలపెళ్లి ఘనంగా జరిగింది.
...