ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య బీమాపై (Health Insurance) మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది. సుమారు 55కు పైగా నిబంధనలను క్రోడీకరించింది. దీని ప్రకారం ఆరోగ్య బీమాపాలసీ ఉన్నవారు రిక్వెస్ట్ చేసిన గంటలోపు నగదు రహిత చికిత్సపై ఆయా ఇన్సురెన్స్ సంస్థలు నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది.
...