పార్లమెంటులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ మొత్తం 71 మంది ఎంపీల సంతకాలతో నోటీసు ఇచ్చినట్టు కూటమి వర్గాలు తెలిపాయి.
...