ఢిల్లీని అభివృద్ధి చేస్తామని, ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రధాని మోదీ (Modi) అన్నారు. అంతేకాదు.. హస్తిన ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారని చెప్పారు. అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామన్నారు. బీజేపీ (BJP) పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
...