ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దైన సంగతి విదితమే. మళ్లీ రాష్ట్రానికి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
...