టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పరిగణిస్తున్నట్టు మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. పంత్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, అతడు టెస్టుల్లో భారత్‌కు ఆడుతూనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా రిషబ్ పంత్ ఎదగాలని గంగూలి అన్నాడు.
...