షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జిల్లాలోని కిల్బల్ గ్రామంలో ఆపరేషన్ (Operation) ప్రారంభించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్ (Encounter) లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు చెప్పారు.
...