ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు దంచికొట్టాయి. తడ వద్ద వాయుగుండం తీరం దాటింది, ఈ ముప్పు వీడిందని ప్రజలు భావిస్తుండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.
...