పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో (Babul Supriyo Joins TMC) నేడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నారు. బాబుల్ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్ బబ్రెయిన్ (Abhishek Banerjee and Derek O'Brien) సాదర స్వాగతం పలికారు.
...