మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పణాజీ (Panaji) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. దీంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లైంది. ‘గతంలో, ఇప్పుడు… మా పార్టీని ఒప్పించడానికి శతధా ప్రయత్నాలు చేశాను. అయినా పణాజీ టిక్కెట్ తెచ్చుకోలేకపోయాను.
...