నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ అంశంపై భారత యువత, ముఖ్యంగా జెన్ జెడ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వీడియో సందేశం ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు కనిపించకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై స్పందించిన మెటా సంస్థ అది సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) వల్ల జరిగిన పొరపాటేనని స్పష్టం చేస్తూ.. వీడియోను వెంటనే పునరుద్ధరించింది.
...