తెలంగాణ అధికార కాంగ్రెస్ వర్గాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేస్తూ సీఎం సిఫార్సు చేయగా, సంబంధిత ప్రతిపాదనలను అధికారికంగా రాజ్ భవన్‌కు పంపారు.
...