ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో రంజాన్ (Ramadan or Ramzan 2021) ఒకటి. ముస్లింలు ఎక్కువగా చాంద్రమాన క్యాలండర్ ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో 'రంజాన్' పండుగ (Ramadan 2021) వస్తుంది. దీనికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ (Quran) ఈ నెలలోనే ఆవిర్భవించింది.
...