ఇటీవల భారతదేశంలో గుండె జబ్బులు, వాటి ప్రభావాలు, మరణాలపై వచ్చిన తాజా నివేదిక ప్రజలను అప్రమత్తం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నమూనా రిజిస్ట్రేషన్ సర్వేలో (Sample Registration Survey), నిపుణుల బృందం దేశంలో జరిగే మరణాల్లో సుమారుగా మూడవ వంతు గుండె సంబంధిత సమస్యల వల్లే జరుగుతున్నదని వెల్లడించింది.
...