భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వానలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
...