Metabolic Health Crisis: భారత్లో మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వంటి మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం వంటి అంశాలను వారు సూచిస్తున్నారు.
...