మధుమేహం (డయాబెటిస్) రోగులను ఎప్పుడూ వేధించే సమస్య ఏదైనా ఉందంటే అది త్వరగా మానని పుండ్లు. ముఖ్యంగా పాదాలకు అయ్యే ఈ పుండ్లు (డయాబెటిక్ ఫుట్ అల్సర్) ఒక్కోసారి ఇన్ఫెక్షన్లకు దారితీసి, అవయవాలను తొలగించాల్సిన పరిస్థితిని కల్పిస్తాయి. దీంతో మధుమేహం వ్యాధిగ్రస్తులు అంగవైకల్యానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది.
...