ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు (Kumbh Mela) ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నాటికి 99.20 లక్షలకు పైగా భక్తులు సంగమ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకారం, జనవరి 13 నుండి మహాకుంభ్‌లో స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్య 54.31 దాటింది.
...