అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
...