తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ మొదలుపెట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న దుర్గమ్మను దర్శించుకొన్న పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయం మెట్లను శుద్ధి చేశారు.
...