ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం (Air circulation) కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు
...