ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
...