రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏ సన్నబియ్యంతో తింటున్నారో గురుకుల హాస్టళ్లలో ఉంటున్న మా బిడ్డలకు కూడా అదే అన్నం పెట్టాలని చెప్పాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుతున్న ఆ బిడ్డలు తెలంగాణ ఆత్మగౌరవం. భావి భారత నిర్మాతలు. వారికి నాణ్యమైన ఆహారం సరఫరా చేయని వారిపై కఠినమైన చర్యలు తప్పవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
...