పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన నలుగురు యువకులు సెల్ఫీ వీడియో తీసుకొని హెయిర్ డై తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం గురువారం కలకలం సృష్టించింది. బాధితులను శివ, అజయ్ కుమార్, రాజు, షారుక్ గా గుర్తించారు.
...