తెలంగాణ ప్రభుత్వం ఇవాళ్టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘననే. 36,559 ఎస్జీటీలను, 3414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ 1.11.2024 నాడు విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం. ఉదయం 9 గంటల నుండి మ. 1 గంటల వరకే (ఒంటి పూట) పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తుందని లేఖలో పేర్కొన్నారు.
...